కౌన్సిలర్లు.. తనను వేధింపులకు గురి చేస్తున్నారంటూ మెదక్ మున్సిపాలిటీ శానిటరీ ఇన్స్పెక్టర్ వనిత ఆరోపించారు. వ్యక్తిగత పనుల కోసం ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపాలిటీ బడ్జెట్ సమావేశంలో ఆమె మాట్లాడారు.
కౌన్సిలర్ల భర్తలు.. అర్ధరాత్రి ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడుతుంటారని వనిత కన్నీటి పర్యంతమయ్యారు. కౌన్సిలర్ కృష్ణారెడ్డి వ్యక్తిగత అవసరాలకు తానెందుకు పని చేయాలని ప్రశ్నించారు. పని విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే ఉద్యోగంలో నుంచి తీసేసినా పర్లేదన్నారు.
ఇదీ చదవండి: మందుబాబుల మనసు మారే.. బీరు నుంచి లిక్కర్‌కు చేరే..!