హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో భారీ చోరీ (Massive Theft at jubilee hills) జరిగింది. నమ్మినబంటే నమ్మక ద్రోహం చేసి రూ.55లక్షలతో ఉడాయించాడు. సంతోశ్‌రెడ్డి అనే స్థిరాస్తి వ్యాపారి తన వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్‌కు రూ.55 లక్షలు ఇచ్చి కోకాపేటలో నివాసముంటున్న స్థల యాజమానికి ఇవ్వాలని పంపించాడు. మధ్యాహ్నం సమయంలో దుర్బిద్దిపుట్టిన డ్రైవర్ శ్రీనివాస్ కోకాపేటకు వెళ్లకుండా డబ్బులు తీసుకుని పరారయ్యాడు.
జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 10లో వ్యాపారి సంతోశ్ రెడ్డి బెంజ్ కారును వదిలేసి డబ్బులతో డ్రైవర్ పరారయ్యాడు. డ్రైవర్‌కు ఎంతసేపు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ రావడం వల్ల మోసపోయానని గ్రహించిన సంతోశ్ రెడ్డి... పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైన దృశ్యాల ఆధారంగా గాలింపు ముమ్మరం చేశారు. కృష్ణా జిల్లాకు చెందిన డ్రైవర్ శ్రీనివాస్ గత 6 నెలలుగా సంతోశ్ రెడ్డి వద్ద పనిచేస్తున్నాడు.
ఇదీ చూడండి: NEPAL GANG: మరోసారి నేపాల్ గ్యాంగ్ హల్చల్.. పాత స్కెచ్‌తో కొత్తగా దోచేశారు
సినిమా కథను మించిన థ్రిల్లర్ స్టోరీ... నేపాల్ గ్యాంగ్ చోరీల మిస్టరీ