ETV Bharat / crime

Suicide: 'నువ్వు అందంగా లేవు.. ఇంకో పెళ్లి చేసుకుంటా..!'

లావుగా ఉన్నావు.. అందంగా లేవు.. వేరొక పెళ్లి చేసుకుంటానని భర్త.. అతడికి మద్దతుగా అత్తామామలు.. వీరి వేధింపులు తాళలేక ఓ గృహిణి బలవన్మరణానికి పాల్పడిన ఘటన హైదరాబాద్​లో చోటుచేసుకుంది.

married women suicide for body shaming comments of her husband

author img

By

Published : Jul 2, 2021, 2:20 PM IST

నారాయణఖేడ్‌కు చెందిన హలీమాబేగం(25)కు బోరబండ స్వరాజ్‌నగర్‌కు చెందిన అబ్దుల్‌ హాసిఫ్‌(32)తో 2018 జూన్‌లో వివాహమైంది. వీరికి రెండున్నరేళ్ల కుమారుడున్నాడు. కొంతకాలంగా... హలీమాను అందంగా లేవని, మరో పెళ్లి చేసుకుంటానని హాసిఫ్‌ వేధిస్తున్నాడు. అత్త బీబీ ఫాతీమా, మామ అబ్దుల్‌ జానీమియా సైతం సూటిపోటి మాటలనేవారు. ఈ విషయాన్ని హలీమా పుట్టింటి వారి దృష్టికి తీసుకెళ్లింది. విడాకులు ఇవ్వమని ఒత్తిడి చేస్తున్నారని గురువారం ఉదయం తల్లికి ఫోన్‌ చేసి చెప్పింది. వచ్చి తనను తీసుకుపొమ్మని కోరింది.

కాసేపటి తరువాత కుటుంబసభ్యులు తిరిగి ఫోన్‌ చేయగా... సమాధానం ఇవ్వలేదు. అనుమానం వచ్చిన తల్లి.. ల్యాండ్‌లైన్‌కు ఫోన్‌ చేసింది. తోటికోడలు మాట్లాడి.. హలీమాబేగం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు చెప్పగా.. హుటాహుటిన హైదరాబాద్​ చేరుకున్నారు. అప్పటికే హలీమా ప్రాణాలు కోల్పోయింది. హలీమా తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కుమార్తె బలవన్మరణానికి భర్త, అత్తామామలే కారణమని పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ చెప్పారు.

ఇదీ చూడండి: CC Footage: మద్యం మత్తులో డ్రైవింగ్​.. బాలుడిపైకి దూసుకెళ్లిన కారు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.