అనుమానాస్పద స్థితిలో కృష్ణ నివేదిత (36) అనే మహిళ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన హైదరాబాద్ సీబీఆర్ రెసిడెన్సీలో జరిగింది. మృతురాలు స్థానికంగా న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలో అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్గా పని చేస్తున్నారని పోలీసులు తెలిపారు.
నివేదిత సీబీఆర్ రెసిడెన్సీలో భర్తతో కలిసి నివాసం ఉంటోంది. ఆ క్రమంలో ఈ రోజు ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. పూర్తి స్తాయితో దర్యాప్తు చేపట్టి మృతికి గల కారణాలను వెల్లడిస్తామని తెలిపారు.
ఇదీ చదవండి: 'ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బంది ఉండొద్దు'