తెలంగాణ- ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టులు తమ ఉనికి చాటుకునేందుకు చర్యలు ప్రారంభించారు. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం లెనిన్ కాలనీలో మావోయిస్టులు మందుపాతర పేల్చారు. అదే సమయంలో ద్విచక్రవాహనంపై అటుగా వెళ్తున్న ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. బైక్‌తో సహా అతను ఎగిరి కింద పడ్డాడు.
![maoists in bhadradri district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-kmm-01-06-mandhu-paathara-av-ts10042_06092021085637_0609f_1630898797_133.jpg)
గమనించిన స్థానికులు హుటాహుటిన క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. పేలుడుకు పాల్పడిన ప్రాంతంలో మావోయిస్టులు గోడ పత్రాలు వదిలి వెళ్లారు. చర్ల శబరి ఏరియా కమిటీ పేరుతో ఈ పత్రాలు ఉన్నాయి. జైళ్లలో ఉన్న రాజకీయ ఖైదీలను వెంటనే విడిచిపెట్టాలని మావోయిస్టులు డిమాండ్ చేశారు.
![maoists in bhadradi district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-kmm-01-06-mandhu-paathara-av-ts10042_06092021094026_0609f_1630901426_662.jpg)
ఇదీ చదవండి: హైదరాబాద్‌లో విలాసా సౌకర్యాల పేరుతో మోసం... కంట్రీ క్లబ్‌కు జరిమానా