భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. చర్ల అటవీ ప్రాంతంలో జరిగిన ఈ కాల్పుల్లో పోలీసుల చేతిలో ఓ మావోయిస్టు మృతి చెందాడు.
చర్ల మండలంలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారనే పక్కా సమాచారంతో ఇవాళ ఉదయం పోలీసులు కుర్నాపల్లి బోధన్‌పల్లి గ్రామ సమీపంలో కూంబింగ్‌కు వెళ్లారు. ఈ క్రమంలో వారికి 10 మంది మావోయిస్టులు తారసపడినట్లు తెలిపారు. ఈ క్రమంలో పోలీసులు.. మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మావోయిస్టు మృతదేహంతో పాటు 303 వెపన్, రెండు కిట్టు బ్యాగులు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
ఘటనలో తప్పించుకున్న మావోయిస్టుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఘటనాస్థలికి పోలీసు ఉన్నతాధికారులు అదనపు బలగాలను తరలించారు. మృతి చెందిన మావోయిస్టును ఇంకా గుర్తించాల్సి ఉంది. ఈ కాల్పులతో భద్రాద్రి ఏజెన్సీలో ఉద్రిక్తత నెలకొంది.
- ఇదీ చదవండి : లైవ్ వీడియో: బస్సు చక్రాల కింద పడి మహిళ మృతి