ములుగు జిల్లాలో తుపాకీ తూటాల డంప్ దొరకడం అలజడి సృష్టిస్తోంది. విశ్వసనీయ సమాచారం మేరకు... ములుగు మండలంలోని మాన్సింగ్ తండా పరిసర ప్రాంతాల్లో ఏఎస్పీ సాయి చైతన్య ఆదేశాల మేరకు ఎస్సై హరికృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. అనుమానిత ప్రదేశంలో మీటర్‌కు పైగా తోతులో ఓ స్టీల్ బకెట్ లభ్యమైంది.
అందులో 312 తుపాకీ తూటాలు, రెండు డిటోనేటర్లు, విప్లవ సాహిత్యాలు లభ్యమైనట్లు పోలీసులు వెల్లడించారు. సీపీఐ మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ సాయుధ పోరాటాలతో... ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులను అంతమొందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఏఎస్పీ సాయి చైతన్య వివరించారు.
ఇదీ చదవండి: 'అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దు'