Rajendranagar Murder Attempt : రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ హైదర్‌గూడలో దారుణం చోటుచేసుకుంది. అర్ధరాత్రి ఓ ఉన్మాది వీరంగం సృష్టించాడు. తల్లి, సోదరుడిపై ఇనుపరాడ్‌తో దాడిచేశాడు. వారికి తీవ్రగాయాలయవ్వడం వల్ల స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
హైదర్‌గూడకు చెందిన సందీప్‌రెడ్డి కుటుంబ కలహాలతో తన తమ్ముడు ప్రదీప్‌రెడ్డిపై దాడి చేశాడు. అది చూసిన తల్లి స్వరూప అడ్డుకోవడానికి వచ్చింది. ఆమెపై కూడా సందీప్‌రెడ్డి దాడి చేశాడు. అడ్డుకోబోయిన స్థానికులపైనా దాడికి తెగబడ్డాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సందీప్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
- ఇదీ చదవండి : భార్యపై అనుమానంతో తల నరికిన భర్త