ETV Bharat / crime

రోడ్డుపై వెళ్తుండగా మహిళ మెడలో మంగళసూత్రం చోరీ - Hyderabad latest news

రోడ్డుపై వెళ్తున్న ఓ మహిళ మెడలో నుంచి గుర్తు తెలియని దుండగులు మంగళసూత్రాన్ని అపహరించిన ఘటన... జవహర్​నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Mangala sutra stolen from a woman's neck
మహిళ మెడలో మంగళసూత్రం అపహరణ
author img

By

Published : Apr 20, 2021, 10:56 PM IST

సికింద్రాబాద్​ బాలాజీనగర్​ కాలనీలో నివాసముంటున్న కవిత అనే మహిళ... ఆరోగ్యం బాగా లేక తన అత్తతో కలిసి ఆస్పత్రికి వెళ్లింది. తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో శ్రీరామ్​నగర్ కాలనీ వద్ద ఇద్దరు వ్యక్తులు బైక్​పై వారికి ఎదురుగా వచ్చారు. చూస్తుండగానే ఆమె మెడలోని నాలుగు తులాల మంగళసూత్రాన్ని అపహరించారు.

ఆమె తేరుకునే లోపే దుండగులు అక్కడి నుంచి ఇండస్ స్కూల్ రోడ్డు వైపు పరారయ్యారు. ఘటనకు సంబంధించి బాధిత మహిళ ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు. సీసీ కెమెరాల ఆధారంగా దొంగలను త్వరలోనే గుర్తిస్తామని అన్నారు.

ఇదీ చదవండి: హైదరాబాద్​లోని పలు ప్రాంతాల్లో వర్షం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.