Suicide: ఆ యువకుడికి ఏ కష్టం వచ్చిందో ఏమో ప్రయాణికులు చూస్తుండగానే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్య చేసుకుందామని రైల్వే స్టేషన్‌కు రాత్రి వచ్చిన యువకుడు.. ధైర్యం చాలక అలాగే ఉండిపోయాడు. అక్కడ ప్రయాణికులు ఉండటంతో వాళ్లు ఆపుతారని భయపడ్డాడో ఏమో.. సమయం కోసం ఎదురుచూశాడు. అందరిలాగే అటూఇటూ తిరిగాడు. తీరా తెల్లవారింది. ఇక చనిపోదామని నిర్ణయించుకున్నాడు. సమయం కోసం చూశాడు. అంతలోనే ట్రాక్‌పైకి అతివేగంతో రైలు వచ్చింది. అంతే ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ వెళ్లి దాని కిందపడిపోయాడు. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా తుని రైల్వే స్టేషన్లో శనివారం ఉదయం ఈ హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది.
సీసీ కెమెరాల్లో దృశ్యాలు
గుర్తుతెలియని యువకుడు (25) తునిలో హాల్టులేని నాందేడ్ ఎక్స్‌ప్రెస్ రైలు కింద పడి బలవన్మరణం చెందడం చూపరులను తీవ్రంగా కలచివేసింది. ఈ సంఘటన రైల్వే స్టేషన్‌లోని 1వ నెంబరు ప్లాట్‌ఫాంపై చోటుచేసుకుంది. ఆ దృశ్యాలు ప్లాట్‌ఫాం వద్ద ఉన్న సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి.
ముఖానికి చేతులు అడ్డు పెట్టుకుని
అంతవరకూ ప్లాట్‌ఫాంపై అటూఇటూ తిరుగుతూ ఉన్న ఆ యువకుడు.. రైలు రాకను గమనించి పట్టాలపైకి దిగి, ముఖానికి చేతులు అడ్డుపెట్టుకుని రైలుకింద పడిపోయాడు. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలికి చేరుకున్నారు. ఆ యువకుడు రాత్రి నుంచి స్టేషన్ పరిసరాల్లోనే తిరుగుతున్నట్లు స్థానికుల ద్వారా తెలిసిందని పోలీసులు చెప్పారు. మృతుడి దగ్గర ఎలాంటి ఆధారాలూ లభించలేదని వెల్లడించారు.
ఇదీ చదవండి: Three died: ఒకే రోజు.. ఒకే రైలు.. ముగ్గురు మృతి..