ETV Bharat / crime

Vaccine: తక్కువ ధరకే టీకాలిస్తామని మోసాలు.. - కరోనా టీకాల పేరుతో మోసాలు

కరోనా కష్టకాలాన్నీ మాయగాళ్లు వదలట్లేదు. ఆక్సిజన్​ కాన్సన్​ట్రేటర్లు, ఔషధాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న కేటుగాళ్లు ఇప్పుడు మరో కొత్త దారిని ఎంచుకున్నారు. కరోనా టీకాలు వేస్తామంటూ డబ్బులు కాజేస్తున్నారు. పలు సంస్థలకు ఫోన్​ చేసి తక్కువ ధరకే ఉద్యోగులకు వ్యాక్సిన్లు వేస్తామని మోసం చేసిన ఓ వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు.

man scams companies to vaccinate low-cost to employees
తక్కువ ధరకే ఉద్యోగులకు టీకాలిస్తామని మోసాలు.. వ్యక్తి అరెస్టు
author img

By

Published : Jun 15, 2021, 12:10 PM IST

కరోనా టీకా పేరిట మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని సైబరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌ నగరానికి చెందిన నాగార్జున రెడ్డి ఏకంగా ప్రముఖ ఎంటర్‌టైన్మెంట్‌ ఛానల్‌కు ఫోన్‌ చేసి... మంత్రి కేటీఆర్‌ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నానని చెప్పాడు. ఛానల్‌ కార్యాలయంలో పనిచేసే వారికి ఒక్కొక్కరికి వంద రూపాయలు చొప్పున చెల్లిస్తే టీకా వేయిస్తామని నమ్మించాడు. నిజమేనని నమ్మిన యాజమాన్యం 1500 మందికి గాను 1.5 లక్షల రూపాయలు చెల్లించింది. డబ్బు చెల్లించాక ఎంతకీ స్పందన లేకపోవడంతో యాజమాన్యం సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

ఇదీ చూడండి: Suicide: కరోనా టీకా వేసుకోమన్నారని.. యువకుడు ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.