సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలంలోని సుల్తాన్పూర్ మెడికల్ డివైస్ పార్క్ సమీపంలో ఉన్న గుట్టల్లో దారుణ హత్య జరిగింది. మృతుడు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన అనిల్ కుమార్‌గా పోలీసులు గుర్తించారు.
పటాన్చెరు డీఎస్పీ భీమ్ రెడ్డి ఆధ్వర్యంలో అమీన్పూర్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. మెడికల్ డివైస్ పార్క్‌లోనే అనిల్ కుమార్ కొంత కాలంగా పని చేస్తున్నాడని చెప్పారు. హత్యకు పాల్పడిన నిందితులను త్వరలోనే పట్టుకుంటామన్నారు. మృతుని సోదరుడు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.
ఇదీ చూడండి: బ్యాంకు ఉద్యోగి ఆత్మహత్య.. వేధింపులే కారణమా!