అప్పటికే పూటుగా మద్యం తాగారు. సమాచారం అడిగిన ఓ వ్యక్తిపై దాడి చేశారు. అతని జేబులో నుంచి పడిన రూ.300, సెల్‌ఫోన్ కోసం అతణ్ని దారుణంగా బండరాయితో మోది హతమార్చారు. ఈ సంఘటన గత నెల 25న శంకర్‌పల్లిలోని వడ్డెర శ్మశానవాటికలో జరగ్గా... నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని గురువారం రిమాండ్‌కు తరలించారు.
శంకర్‌పల్లి సీఐ మహేష్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా మెట్‌పల్లికి చెందిన సాయిలు(35), మల్లేష్(45) అన్నదమ్ములు. ఇద్దరూ వేర్వేరు ప్రాంతాల్లో పనులు చేసుకుంటున్నారు. శంకర్‌పల్లిలో నివాసం ఉండే మల్లేష్ వద్దకు గత నెల 25న సాయిలు వచ్చాడు. ఇద్దరూ కలిసి మద్యం తాగారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం, చెరుకుపల్లికి చెందిన చెన్నయ్య(55) ఏదో సమాచారం కోసం వీరితో మాట్లాడగా.. వీళ్లు తాగిన మైకంలో అతణ్ని అకారణంగా కొట్టారు. ఆ సమయంలో చెన్నయ్య జేబునుంచి రూ.300, ఫోన్ కింద పడగా.. వాటిని సాయిలు, మల్లేష్ చూశారు. చెన్నయ్య వాటిని తీసుకోని కొద్ది దూరం వెళ్లగా.. అతణ్ని గట్టిగా పట్టుకుని శ్మశానవాటికలోకి తీసుకెళ్లి.. బండరాతితో మోది హత్య చేసి..రూ.300, ఫోన్ తీసుకుని పరారయ్యారు. సీసీటీవీల ఆధారంగా నిందితులను పట్టుకున్నారు.
ఇవీ చూడండి: