ETV Bharat / crime

గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి - Telangana news

నారాయణపేట జిల్లా ఊట్కూర్​ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
author img

By

Published : Feb 8, 2021, 10:29 PM IST

గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతిచెందిన ఘటన నారాయణపేట జిల్లా ఊట్కూర్​ పరిధిలో చోటుచేసుకుంది. జిల్లాలోని చిన్నపొర్ల గ్రామానికి చెందిన చర్లబాబు శ్రీనివాస్... వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. నారాయణపేట నుంచి ద్విచక్రవాహనంపై చిన్నపొర్లకు వస్తుండగా మార్గమధ్యలో ఊట్కూరు పరిధిలో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది.

ఈ ఘటనలో తలకు తీవ్రగాయాలై శ్రీనివాస్​... అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మక్తల్ సీఐ శంకర్, ఎస్ఐ రవి వివరాలు సేకరించి... దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నారాయణపేట జిల్లా ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చూడండి: మంత్రి కేటీఆర్​ను సెల్ఫీ కోరిన వృద్ధురాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.