ETV Bharat / crime

విద్యుత్​ స్తంభానికి కట్టేసి కొట్టి... హత్య - మూసాపేటలో వ్యక్తిని స్తంభానికి కట్టేసి హత్య

man killed in mahabubnagar
man brutal murder, moosapet murder
author img

By

Published : Apr 1, 2021, 8:59 AM IST

Updated : Apr 1, 2021, 9:43 AM IST

08:54 April 01

మూసాపేట మండలం తిమ్మాపూర్‌లో వ్యక్తి హత్య

 మహబూబ్‌నగర్ జిల్లా మూసాపేట మండలం తిమ్మాపూర్‌లో ఓ వ్యక్తిని విద్యుత్​ స్తంభానికి కట్టేసి కొట్టి హత్య చేశారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని పోలీసులు పేర్కొన్నారు. మృతుడు జానంపేట వాసి రాములుగా గుర్తించారు.  

ఏమి జరిగిందంటే..

 జానంపేటకు చెందిన రాములు బుధవారం రాత్రి తిమ్మాపూర్​ వెళ్లాడు. ఓ మహిళ ఇంట్లో ఉన్న రాములును బంధించిన ఆమె బంధువులు విద్యుత్​ స్తంభానికి కట్టేసి కొట్టారు. బంధువుల దాడిలో గాయపడిన రాములు అపస్మారక స్థితిలో మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి వెళ్లి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మహబూబ్​నగర్​ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  

ఇదీ చూడండి: కవ్వింపుగా వలవేసి... వేధించి ఉసురు తీసి

Last Updated : Apr 1, 2021, 9:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.