ETV Bharat / crime

illegal affair: వివాహేతర సంబంధం.. వ్యక్తి ప్రాణం తీసింది! - అక్రమ సంబంధం

వివాహేతర సంబంధం అతని ఉసురు తీసింది. "పదేళ్లుగా నా ఆస్తినంతా అంతా మీకే పెట్టాను" అన్న మాటే పాపమయ్యింది. ఏపీలోని విశాఖ జిల్లా గొలుగొండ మండలంలోని జిల్లేడు పూడి గ్రామంలో గిరిబాబు అనే వ్యక్తి పెట్టుకున్న వివాహేతర సంబంధం.. చివరికి అతడి ప్రాణం తీసింది.

illegal affair
illegal affair
author img

By

Published : Jul 29, 2021, 3:07 PM IST

ఏపీలోని విశాఖ జిల్లా గొలుగొండ మండల పరిధిలో.. ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. కొంత కాలంగా అతను ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. చివరికి ఆమె కుమారుడి చేతిలోనే హతమయ్యాడు.

పోలీసుల వివరాల ప్రకారం.. జిల్లేడుపూడి గ్రామంలో పూల వ్యాపారం చేస్తున్న గిరిబాబు.. అదే గ్రామానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. తరచుగా ఆమె ఇంటికి వెళ్లేవాడు. అప్పటికే ఆమెకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ క్రమంలో ఆమె గురించి ఇరుగుపొరుగు వారు చేసే వ్యాఖ్యలతో ఆమె కుమారులు మనస్తాపానికి గురయ్యారు. తమ ఇంటికి రావొద్దని గిరిబాబుతో ఇటీవల ఆమె రెండో కుమారుడు రాజబాబు గొడవపడ్డాడు.

వాదనతో ఆవేశానికి గురైన గిరిబాబు.. గత పదేళ్లుగా తన ఆస్తిని సర్వస్వాన్ని మీ కోసమే ఖర్చు చేస్తున్నానంటూ బదులిచ్చాడు. ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి ఘర్షణకు దారి తీసింది. గిరిబాబును రాజబాబు చితకబాదాడు. తీవ్ర గాయాలపాలైన గిరిబాబు అక్కడికక్కడే చనిపోయాడు. మృతుని బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేసుకున్నట్లు నర్సీపట్నం గ్రామీణ సర్కిల్ ఇన్​స్పెక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు.

ఇదీ చూడండి: DONKEYS MURDER: పొలంలోకి వచ్చి అరుస్తున్నాయని.. గాడిదలను చంపిన సైకో..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.