ద్విచక్ర వాహనం చెట్టుకు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లా రుక్మాపూర్ శివారులో చోటు చేసుకుంది. న్యాల్ కల్ మండలం ముంగి గ్రామానికి చెందిన వడ్డే నగేశ్… గంగ్వార్ నుంచి ముంగి గ్రామానికి వెళ్తున్నాడు. ఈదురు గాలులతో కూడిన వర్షం పడడం వల్ల రోడ్డుపై చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి.
వర్షపు జల్లుల వల్ల రోడ్డుపై పడిన చెట్ల కొమ్మలు కనిపించక ద్విచక్ర వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఘటనలో నగేశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య శోభ ఫిర్యాదు మేరకు హద్నూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.