ETV Bharat / crime

గొంతులో ఆమ్లెట్​ ఇరుక్కుని వ్యక్తి మృతి.. - Man Dies due to omelet Stuck in Throat

Man Dies After Omelet Stuck in Throat: గొంతులో ఆమ్లెట్​ ఇరుక్కుని ఓ వ్యక్తి చనిపోయాడు. ఈ మాట చెప్పగానే 'ఆమ్లెట్​ ఇరుక్కుని చనిపోవడమేంట్రా.. తాగి మాట్లాడుతున్నావా'' అని తిట్టడం కామనే. ఎందుకంటే చనిపోయాడని చెప్పడానికి మనం చెప్పిన రీజన్ అలాంటిది మరి. కానీ ఇది నిజంగా నిజం. అసలు ఇది ఎక్కడ జరిగిందంటారా..?

గొంతులో ఆమ్లెట్​ ఇరుక్కుని వ్యక్తి మృతి
గొంతులో ఆమ్లెట్​ ఇరుక్కుని వ్యక్తి మృతి
author img

By

Published : Nov 4, 2022, 10:48 AM IST

Man Dies After Omelet Stuck in Throat: మద్యం తాగేందుకని ఓ వ్యక్తి వైన్​ షాపుకెళ్లాడు. తనకు నచ్చిన బ్రాండు అడిగాడు. ఇచ్చిన బాటిల్​ తీసుకుని పక్కనే ఉన్న పర్మిట్​ రూమ్​(మద్యం తాగేందుకు అనుమతి గది)లోకి వెళ్లాడు. ఖాళీగా ఉన్న ఓ టేబుల్​ చూసుకుని కూర్చున్నాడు. బాటిల్​ ఓపెన్​ చేసి.. ఓ పెగ్గు కలిపాడు. అప్పుడు గుర్తొచ్చింది మనోడికి మంచింగ్​ సంగతి. మందు ఓకే.. మరి మంచింగ్​ ఏం తీసుకుందాం అని కాసేపు ఆలోచిస్తే.. అసలే చలిగా ఉంది కదా వేడివేడిగా ఏదైనా అయితే బాగుంటుందని అనిపించింది. మరీ కాస్ట్​లీవి మనకెందుకు.. ఓ ఆమ్లెట్​తో సరిపెట్టేద్దాంలే​ అనుకుని ఆర్డర్​ ఇచ్చాడు. వేడివేడిగా ఆమ్లెట్​ టేబుల్​పైకి వచ్చేసింది. ఇంకెందుకు ఆలస్యం అనుకుని ఓ పెగ్గేశాడు. వేడివేడి ఆమ్లెట్​ను​ తీసుకుని అలా నోట్లో పెట్టుకున్నాడు. అంతే.. అదే ఆమ్లెట్​ యమపాశమై మనోడి ప్రాణాలను తీసేసింది.

జనగామ జిల్లా బచ్చన్నపేటలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. బచ్చన్నపేటకు చెందిన ఈదులకంటి భూపాల్‌రెడ్డి (38) స్థానిక మద్యం దుకాణంలోని అనుమతి గదిలో కూర్చొని మద్యం తాగుతున్నాడు. తాను తింటున్న ఆమ్లెట్‌ గొంతులో ఇరుక్కుపోవడంతో అక్కడికక్కడే చనిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

''మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరమని ప్రతోడు చెప్తాడు.. కానీ కొన్ని రకాల మంచింగ్​లు కూడా​ ప్రాణానికి ప్రమాదకరమని ఒక్కడు కూడా చెప్పడేంట్రా బాబు..'' పై ఘటనను చూస్తే ఎందుకో ఈ లైన్​ చెప్పాలనిపించింది. ఏమంటారు ప్రెండ్స్​..!

ఇవీ చూడండి..

దోపిడీ దొంగల పని కాదు.. అంత ఆమె ప్లానే.. అసలేం జరిగిందంటే..!

కలెక్టరమ్మ వచ్చింది.. రాములోరి గుడికి కాంతులు తెచ్చింది

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.