వ్యవసాయ మోటారు తీయడం కోసం నదిలో దిగి వ్యక్తి మృతి చెందిన ఘటన.. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ఎల్లాపూర్ గ్రామ శివారులో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నెరల్లా సత్తయ్య(48) గురువారం ఉదయం.. గ్రామస్థులతో కలిసి మరో వ్యక్తికి చెందిన వ్యవసాయ మోటార్ తీయడానికి మంజీరా నదిలో దిగాడు. లోతు ఎక్కువగా ఉండటంతో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు.
మృతురాలి భార్య దుర్గవ్వ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఏరియా ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చదవండి: హయత్నగర్లో రోజువారి కూలీ దారుణ హత్య