ETV Bharat / crime

చావులోనూ వీడని 'బంధం'.. తమ్ముడి మృతదేహాన్ని చూసి అన్నకు గుండెపోటు - brothers died due to heart attack in lakshettipet

Brothers died due to Heart Attack: ఆ అన్నదమ్ములకు తల్లి పంచిన పేగు బంధం.. వారి మధ్య ఆప్యాయతను 50 ఏళ్ల పాటు పదిలంగా ఉంచింది. పెళ్లిళ్లు చేసుకుని వేరు కాపురాల్లో ఉన్నా.. ఏనాడూ పొరపొచ్చాలు రాకుండా ఆదర్శంగా పెరిగారు. అందుకే మరణం కూడా వారిని విడదీయలేకపోయింది. తమ్ముడి అకాల మరణాన్ని తట్టుకోలేక పోయిన అన్న సైతం.. తుదిశ్వాస విడిచారు. ఈ హృదయ విదారక ఘటన మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో జరిగింది.

Brothers died due to Heart Attack
గుండెపోటుతో అన్నదమ్ములు మృతి
author img

By

Published : May 9, 2022, 1:17 PM IST

Brothers died due to Heart Attack: దాదాపు 50 ఏళ్లపాటు తనతో కలిసి పెరిగిన తమ్ముడు ఇక లేడు అని తెలిసేసరికి ఆ అన్న తట్టుకోలేకపోయారు. కాసేపట్లో తన రక్త సంబంధం మట్టిలో కలిసిపోతుందనే బరువైన నిజాన్ని ఆ అన్న గుండె మోయలేకపోయింది. అందుకే తమ్ముడి మరణవార్తను తట్టుకోలేని ఆ అన్న హృదయం.. ఒక్కసారిగా ఆగిపోయింది. ఒక్కరోజులేనే గుండెపోటుతో అన్నదమ్ములిద్దరూ మృతి చెందడంతో.. వారి కుటుంబంలో తీరని విషాదం నెలకొంది.

మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో విషాదఛాయలు అలుముకున్నాయి. 24 గంటల వ్యవధిలో అన్నదమ్ములిద్దరూ గుండెపోటుతో మృతి చెందారు. లక్షెట్టిపేట పట్టణానికి చెందిన గాజుల భాస్కర్ గౌడ్ (47).. ఆదివారం గుండె పోటుతో మృతి చెందారు. తమ్ముడు మృతదేహాన్ని చూసిన అన్న శ్రీనివాస్ గౌడ్​ సైతం గుండెపోటుతోనే తుదిశ్వాస విడిచారు.

ఒకే రోజు అన్నదమ్ములిద్దరూ గుండె పోటుతో మృతి చెందడంతో కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. తమ్ముడి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు జగిత్యాల నుంచి స్వగ్రామం లక్షెట్టిపేటకు వచ్చిన శ్రీనివాస్ గౌడ్.. తమ్ముడి మృతదేహాన్ని చూసి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆస్పత్రికి తరలించేలోపే గుండెపోటు ఎక్కువ కావడంతో మృతి చెందారు. తమ్ముడి కడసారి చూపు కోసం వచ్చిన అన్న సైతం.. విగతజీవిగా మారడంతో బంధువుల రోదనలు మిన్నంటాయి.

ఇవీ చదవండి: Awareness on Normal Deliveries : 'కడుపు 'కోత'లకు కత్తెర పడాల్సిందే..'

షాహీన్​బాగ్​కు మళ్లీ బుల్డోజర్లు.. టెన్షన్​ టెన్షన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.