ద్విచక్రవాహనంపై వేగంగా వెళ్తూ... ఫ్లై ఓవర్ డివైడర్‌ను ఢీకొని వ్యక్తి మృతిచెందిన ఘటన బాలానగర్ పైవంతనపై (Balanagar Flyover) చోటుచేసుకుంది. ఏపీ ప్రకాశం జిల్లా కొనిదెన గ్రామానికి చెందిన అశోక్... లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. హైదరాబాద్ కేపీహెచ్బీలో ఉండే తన సోదరుడు ఇంటికి వచ్చిన అశోక్... లైసెన్స్ తీసుకునేందుకు తిరుమలగిరిలోని ఆర్టీఏ కార్యాలయానికి ద్విచక్రవాహనంపై బయల్దేరాడు.
బాలానగర్‌పై వంతెనపై వేగంగా వెళ్తు ఎడమవైపు ఉన్న సేఫ్టీ డివైడర్‌ను ఢీకొట్టాడు. తీవ్రగాయాలపాలైన అశోక్‌ను... స్థానికుల సాయంతో 108లో ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న బాలానగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం తాలుకు దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి.
ఇటీవలే పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా బాలానగర్ ఫ్లైఓవర్ ప్రారంభమైంది. పైవంతెన ప్రారంభమయ్యాక జరిగిన మొదటి ప్రమాదం ఇదే.