ETV Bharat / crime

అదుపుతప్పి ద్విచక్రవాహనం బోల్తా.. వ్యక్తి మృతి - man died for going MLC election preparatory meeting

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశానికి వెళ్తున్న ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో చనిపోయిన ఘటన ములుగు జిల్లాలో చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనం అదుపు తప్పి కింద పడడంతో తీవ్ర గాయాలవగా.. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే చనిపోయాడు.

man-died-in-road-accident-who-was-going-to-the-mlc-election-preparatory-meeting-in-mulugu-district
ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశానికి వెళ్తున్న వ్యక్తి మృతి
author img

By

Published : Feb 14, 2021, 9:59 AM IST

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశానికి వెళ్తున్న ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ములుగు జిల్లా ఎటుర్​నాగారం మండల కేంద్రంలో జరగుతున్న ఎన్నికల సన్నాహక సమావేశానికి చిన్నబోయినపల్లి గ్రామానికి చెందిన కుసుమ రాజు కుమార్ బయలుదేరాడు. ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్దకు రాగానే ద్విచక్ర వాహనం అదుపు తప్పి కింద పడడంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన రాజు కుమార్​ని మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎంకి తరలిస్తుండగా.. మార్గ మధ్యలో చనిపోయాడు.

అండగా ఉంటా..

విషయం తెలుసుకున్న పల్లా రాజేశ్వర్ రెడ్డి.. మృతి చెందిన రాజు కుమార్ కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఎంపీ కవిత, మంత్రి సత్యవతి రాఠోడ్, కుసుమ జగదీశ్వర్, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు కార్యకర్తలు మృతునికి రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.

ఇదీ చూడండి: రెప్పపాటులో ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.