పెళ్లి రోజునే అతనికి నూరేళ్లు నిండాయి. మ్యారేజ్ డే రోజున ఉదయమే లేచి భార్యతో కలిసి ఆలయానికి వెళ్లాడు. తమను ఎళ్లవేలలా కాపాడు స్వామి అంటూ మొక్కుకున్నాడు. భార్యను గుడి నుంచి తీసుకొచ్చి ఇంటివద్ద దింపాడు. అనంతరం పనినిమిత్తం వెళ్లాలనుకుంటే మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో వెంటాడింది. ఈ హృదయ విదారక ఘటన ఆదిలాబాద్ జిల్లాలో జరిగింది.
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం మాండగడలో విషాదఘటన చోటుచేసుకుంది. ఆ గ్రామానికి చెందిన ఉమేశ్ అనే వ్యక్తి తన పెళ్లి రోజు కావడంతో భార్యతో గుడికి వెళ్లి ఆమెను ఇంటి వద్ద దింపాడు. ఆ తర్వాత పనినిమిత్తం మహారాష్ట్రకు బైక్‌పై వెళ్తుండగా.. గ్రామసమీపంలోని రహదారిపై వెనక నుంచి వాహనం ఢీకొనడంతో అక్కడిక్కడే చనిపోయాడు. ఏడాది పూర్తయిన సందర్భంగా పెళ్లి వేడుకలు జరుపుకున్న కొద్దిసేపటికే ఈ ప్రమాదం జరగడం ఆ కుటుంబంలో విషాదం నింపింది. భార్యను గుడికి తీసుకెళ్లేటపుడు హెల్మెట్ ధరించిన ఆయన ఊరు వెళ్లేటపుడు హెల్మెట్‌ను ఇంటి వద్ద ఉంచడం.. తలకు గాయాలై చనిపోవడంతో హెల్మెట్ ఉంటే ప్రాణాలు నిలిచేవన్న మాట వినిపించింది. పెళ్లి వేడుకలు జరుపుకున్న కొద్దిసేపటికే ఈ ప్రమాదం జరగడంతో తన కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.
ఇవీ చదవండి: