Man commits suicide by killing woman: ఏపీలోని కర్నూలు జిల్లా ఆస్పరి మండలం ముత్తుకూరు గ్రామంలో మహిళ దారుణ హత్యకు గురైంది. లింగమ్మ (52) అనే మహిళను ఆమె బావ హనుమంతు బుధవారం అర్ధరాత్రి రాళ్లతో కొట్టి దారుణంగా హత్య చేశాడు. అనంతరం అతడు సైతం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. హనుమంతు ఆదోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉందని.. లింగమ్మ భర్త కొన్నేళ్ల క్రితం చనిపోయాడని డబ్బుల కోసం తల్లిని కూడా వేధించేవాడని హనుమంతు కుమారుడు మధు తెలిపాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆస్పరి పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: Dog Murder: కట్టేసి ఉన్న కుక్కను కిరాతకంగా నరికి హత్య..!
murder: 'మరదలిని చంపి తానూ కూడా ఆత్మహత్య.. ఆ సంబంధమే కారణం' - కర్నూలు జిల్లా లేటెస్ట్ అప్డేట్స్
ఏపీలో వివాహేతర సంబంధం ఇద్దరి ప్రాణాలను బలికొంది. ఓ మహిళను ఆమె బావ రాళ్లతో కొట్టి దారుణంగా హత్య చేశాడు. అనంతరం తానూ కూడా పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా ఆస్పరి మండలం ముత్తుకూరులో జరిగింది.