ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా నూజివీడు మండలం తుక్కుల్లురు గ్రామంలో.. అప్పుల బాధ తాళలేక పురుగులమందు తాగి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యేసు అనే వ్యక్తి పేకాట కోసం.. గ్రామానికి చెందిన ముగ్గురి వద్ద అప్పు తీసుకున్నాడు. వారంతా అప్పు తీర్చాలని ఒత్తిడి తీసుకురావడంతోనే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియో తీసుకుని.. పురుగులమందు తాగాడు.
తన చావుకు కారణమంటూ కొంతమంది పేర్లను యేసు తన వీడియోలో ప్రస్తావిస్తూ.. పురుగుల మందు తాగాడు. గమనించిన స్థానికులు సమీపంలోని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ శుక్రవారం మరణించాడు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి: ప్రజల ప్రాణాల కంటే డబ్బు ముఖ్యం కాదు: సీఎం కేసీఆర్