నిజామాబాద్ జిల్లా అంబం గ్రామానికి చెందిన షారాపు పవన్ కుమార్ రాజకీయ నాయకుల ప్రతినిధినని చెబుతాడు. ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసాలకు పాల్పడుతున్నట్లు సీఐ అజయ్ కుమార్ తెలిపారు. ఓ బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించామన్నారు.
మహిళలను మోసం చేస్తూ... వారి అశ్లీల చిత్రాలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్న పవన్‌ను కఠినంగా శిక్షించాలని స్థానిక మహిళా నాయకురాలు శీలం సరస్వతి కోరారు. ఈ కేసుపై ప్రత్యేక చొరవ తీసుకొని నిందితున్ని అరెస్ట్ చేసిన పోలీసులను పలువురు మహిళలు అభినందించారు.
ఇదీ చూడండి: చిన్నారిపై అత్యాచారం.. నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష