Life imprisonment sentence in murder case: భార్య మేనమామను గొడ్డలితో నరికి చంపిన ఘటనలో నిందితుడికి మల్కాజిగిరి కోర్టు జీవిత ఖైదును సోమవారం విధించింది. తన భార్యను తనకు కాకుండా చేస్తున్నాడనే కోపంతో హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కుషాయిగూడ మీర్‌పేట హౌసింగ్ బోర్డులో నిందితుడు ఇప్పల శ్రీనివాస్, భార్య రేణుక 2014 నుంచి నివసించేవారు. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. భార్య రేణుక ఎవరితో మాట్లాడినా శ్రీనివాస్ అనుమానం వ్యక్తం చేసేవాడని... తరుచూ తాగి వచ్చి భార్యతో గొడవకు దిగేవాడని పోలీసులు తెలిపారు. భర్త వేధింపులు తట్టుకోలేక ఆమె పుట్టింటికి వెళ్లింది. శ్రీనివాస్ మద్యానికి బానిసై... భార్య మేనమామ పోలేపాక శ్రీనివాస్‌ను సంప్రదించి.. పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టారు. అందరి ముందు తనను మందలించడంతో భార్య మేనమామపై పగ పెంచుకొని... గొడ్డలితో నరికి చంపాడని పోలీసులు వెల్లడించారు.
మృతుని భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసి... విచారణ జరిపి ఆధారాలు కోర్టుకు అందజేశారు. వాదనలు విన్న మల్కాజిగిరి కోర్టు నిందితుడు ఇప్పల శ్రీనివాస్‌కు రూ.పదివేల జరిమానా, జీవిత ఖైదు విధించింది.
ఇదీ చదవండి: హైదరాబాద్‌కు చెందిన నగల వ్యాపారి సంజయ్ కుమార్ అరెస్ట్..