ETV Bharat / crime

Friendly police: మానవత్వం చాటుకున్న మాక్లూర్ ఎస్​ఐ - maklur si rajareddy helped to injured people in accident

నిజామాబాద్ నగర శివారులోని రోడ్డుపై జరిగిన ప్రమాదంలో గాయపడ్డ ఇద్దరు భార్యాభర్తలకు మాక్లూర్ ఎస్​ఐ సాయం చేసి మానవత్వం చాటుకున్నారు. అంబులెన్స్​కి ఫోన్ చేసినా... సమయానికి రాకపోవడంతో తానే స్వయంగా పోలీసు వాహనంలో ఎక్కించుకొని ఆస్పత్రికి తరలించారు.

maklur si rajareddy helped to husband and wife
మానవత్వం చాటుకున్న మాక్లూర్ ఎస్ఐ
author img

By

Published : Jun 14, 2021, 7:47 PM IST

నిజామాబాద్ జిల్లా మాక్లూర్ ఎస్​ఐ రాజారెడ్డి రోడ్డు ప్రమాదంలో గాయపడిన భార్యాభర్తలకు సాయం చేసి మానవత్వం చాటుకున్నారు. విధి నిర్వహణలో భాగంగా ఎస్​ఐ రాజారెడ్డి సోమవారం మధ్యాహ్నం భోజనం చేసేందుకు ఇంటికి వెళ్లారు. అన్నం తిని పోలీస్ స్టేషన్​కు తిరిగి వస్తుండగా నగర శివారులోని మానిక్ భండార్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ ఘటనలో తీవ్రంగా గాయపడిన దంపతులను గమనించిన ఎస్​ఐ.. వారిని ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. వెంటనే అంబులెన్స్​కి సమాచారమందించారు.

ఎంత సేపటికీ అంబులెన్స్ రాకపోవడంతో... రక్తపు మడుగులో ఉన్న భార్యాభర్తలని స్వయంగా తానే ఆస్పత్రికి తీసుకెళ్లాలని నిశ్చయించుకున్నారు. వెంటనే క్షతగాత్రులను పోలీసు వాహనంలో ఎక్కించుకొని నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రోడ్డు పక్కన గాయాలతో ఉన్న వారిని గుర్తించి పోలీస్ వాహనంలో ఆసుపత్రికి తరలించిన ఎస్ఐ​ రాజారెడ్డిని స్థానికులు అభినందించారు.

ఇదీ చూడండి: Petrol Price: హైదరాబాద్​లోనూ సెంచరీ దాటిన పెట్రోల్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.