ETV Bharat / crime

కోఠిలో అర్ధరాత్రి అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం - హైదరాబాద్​లో రోడ్డు ప్రమాదం వార్తలు

హైదరాబాద్‌ కోఠిలో అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఓ వస్త్ర దుకాణంలో చెలరేగిన మంటలు.. పక్కనున్న దుకాణాల్లోకి వ్యాపించాయి. ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక, విపత్తు నిర్వహణ సిబ్బంది అగ్నిమాపక శకటాలతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదంలో ఆస్తి నష్టం భారీగానే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

major fire accident at koti in hyderabad
కోఠిలో అర్ధరాత్రి అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం
author img

By

Published : Feb 7, 2021, 6:34 AM IST

కోఠిలో అర్ధరాత్రి అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం

ఎప్పుడు రద్దీగా ఉండే కోఠి ఆంధ్రాబ్యాంకు కూడలి వద్ద అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆంధ్రాబ్యాంకు సమీపంలో ఉండే వస్త్ర దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మొదట ఒక దుకాణంలో చెలరేగిన మంటలు పక్కనే ఉన్న మరో ఐదు దుకాణాలకు వ్యాపించాయి. బట్టలు విక్రయించే దుకాణాలు కావడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. షాపులు మూసివేసిన యజమానులు ఇంటికి వెళ్లిన తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది.

కన్నీటి పర్యంతం

ప్రమాదం జరిగిన సమయంలో దుకాణాల్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఆయా షాపుల్లోని వస్త్రాలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం తెలుసుకున్న దుకాణ యజమానులు ఘటనా స్థలానికి చేరుకొని... అగ్నికి ఆహుతవుతున్న తమ షాపులను చూసి కన్నీటి పర్యంతమయ్యారు. ఒక దశలో దుకాణాల్లోకి వెళ్లి బట్టలను బయటకు తీసుకువచ్చే ప్రయత్నం చేయడంతో... పోలీసులు వారిని అడ్డకొని అక్కడ నుంచి పంపించివేశారు.

వ్యాపారుల ఆవేదన

నలభై ఏళ్లుగా బట్టల దుకాణాలు ఏర్పాటు చేసుకొని కోఠిలోనే జీవనం కొనసాగిస్తున్నామని... అగ్నిప్రమాదంతో తాము అన్నీ కోల్పోయి.. రోడ్డున పడ్డామని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇటీవలే సరుకు తీసుకువచ్చినట్టు వాపోయారు. ప్రమాదం కారణంగా ట్రాఫిక్‌ జాం ఏర్పడటంతో.... పోలీసులు వాహనాలను ఆంధ్రాబ్యాంకు వైపు రాకుండా మళ్లించారు. సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక, విపత్తు నిర్వాహణ సిబ్బంది... సుమారు నాలుగు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

విద్యుదాఘాతం కారణంగానే మంటలు చెలరేగాయా, లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. అగ్ని ప్రమాదం వల్ల సర్వం కోల్పోయిన తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వస్త్ర దుకాణాల యజమానులు కోరుతున్నారు.

ఇదీ చదవండి: నేడు తెరాస రాష్ట్ర కార్యవర్గ సమావేశం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.