ETV Bharat / crime

Maid died: లిఫ్ట్‌లో ఇరుక్కొని అనుమానాస్పద స్థితిలో పనిమనిషి మృతి - Banjarahills crime news

Maid died: విశ్రాంత ఆర్‌అండ్‌బి ఉద్యోగి ఇంట్లో పనిచేస్తున్న మహిళ లిఫ్ట్‌లో ఇరుక్కొని అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన హైదరాబాద్ బంజారాహిల్స్​లో చోటుచేసుకుంది. షోలాపూర్‌ ప్రాంతానికి చెందిన నరేష్‌, వీణ(38) తమ ఇద్దరు పిల్లలతో కలిసి కార్వాన్‌లో ఉంటున్నారు

పనిమనిషి
పనిమనిషి
author img

By

Published : Jan 22, 2022, 4:43 PM IST

Maid died: విశ్రాంత ఆర్‌అండ్‌బి ఉద్యోగి ఇంట్లో పనిచేస్తున్న మహిళ లిఫ్ట్‌లో ఇరుక్కొని అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన హైదరాబాద్ బంజారాహిల్స్​లో చోటుచేసుకుంది. షోలాపూర్‌ ప్రాంతానికి చెందిన నరేష్‌, వీణ(38) తమ ఇద్దరు పిల్లలతో కలిసి కార్వాన్‌లో ఉంటున్నారు. భర్త అక్కడే దర్జీగా పనిచేస్తుండగా వీణ హౌజ్‌కీపింగ్‌ విభాగంలో పనిచేసి కొద్ది రోజులుగా ఇంట్లోనే ఉంటోంది. షేక్‌పేట సమీపంలోని లక్ష్మీనగర్‌లో నివసించే విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి మధుసూదన్‌రెడ్డి కుమారుడు, కోడలు చెన్నైలో నివసిస్తున్నారు.

వారి చిన్నారితో శనివారం (నేడు) హైదరాబాద్‌కు రానుండటంతో ఇంట్లో పనిచేసేందుకు మధుసూదన్‌రెడ్డి తనకు తెలిసిన కుర్మయ్య అనే హౌజ్‌కీపింగ్‌ సూపర్‌వైజర్‌ను సంప్రదించాడు. దీంతో కుర్మయ్య తనకు తెలిసిన వీణను పనికి కుదిర్చాడు. ఈ క్రమంలో మధుసూదన్‌రెడ్డి ఇంట్లో పనిచేస్తున్న ఆమె సాయంత్రం మూడో అంతస్తులో కుమారుడు, కోడలికి కేటాయించిన గదిని శుభ్రం చేసేందుకు వెళ్లేందుకు లిఫ్టు ఎక్కింది. ప్రమాదవశాత్తు లిఫ్ట్‌లో ఇరుక్కొని అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.