ETV Bharat / crime

ఎన్​ఆర్​ఐ కుటుంబం హత్య కేసులో అసలేం జరిగింది? - మధురవాడలో నలుగురు మృతి న్యూస్

కనిపెంచిన తల్లిదండ్రులు, కలిసి పెరిగిన తమ్ముడ్ని కిరాతకంగా చంపాల్సిన అవసరం ఆ యువకుడికి ఎందుకొచ్చింది?. ఏపీలోని విశాఖ మధురవాడలో ఎన్​ఆర్​ఐ కుటుంబం అనుమానాస్పద మృతి కేసు విచారణలో వ్యక్తమవుతున్న ప్రధాన అనుమానమిది. బంధుమిత్రుల దృష్టిలో ఆ యువకుడు ఎంతో సౌమ్యుడు. వారిది సంతోషంగా ఉండే కుటుంబమే. వారందరి ఆలోచనలకు భిన్నంగా ఏం జరిగి ఉంటుంది? ఇలా స్థానికులు, పోలీసుల్ని తొలిచివేస్తున్న ప్రశ్నలు అనేకం. లభ్యమవుతున్న ఆధారాలు.. దీపక్‌ మరణించే ముందు ముగ్గురు కుటుంబసభ్యులను అత్యంత పాశవికంగా హతమార్చాడనే వాదనను ఘటన స్థలంలోని ఆధారాలు బలపరుస్తున్నాయి.

nri family murders in visakhapatnam
ఎన్​ఆర్​ఐ కుటుంబం హత్యకేసులో కొనసాగుతున్న పోలీసులు దర్యాప్తు
author img

By

Published : Apr 18, 2021, 8:10 PM IST

ఎన్​ఆర్​ఐ కుటుంబం హత్యకేసులో కొనసాగుతున్న పోలీసులు దర్యాప్తు

ఏపీలోని విశాఖ మధురవాడలో నలుగురు కుటుంబసభ్యుల అనుమానాస్పద మృతి కేసులో పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు. అపార్ట్‌మెంట్‌ వాసులు, బంధుమిత్రులు.. ఇలా ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా ప్రశ్నిస్తున్నారు. కేసులో మొదటి నుంచి పోలీసులు.. మృతుడు బంగారునాయుడు పెద్దకుమారుడు దీపక్‌పైనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీపక్‌ కాల్‌డేటాను విశ్లేషించిన పోలీసులు.. కుటుంబసభ్యులు, బంధువులతో పాటు ఇద్దరు స్నేహితులతో ఎక్కువగా మాట్లాడినట్లు గుర్తించారు. వారి నుంచి తెలుసుకున్న వివరాల మేరకు దీపక్‌... చాలా సున్నిత మనస్తత్వం కలిగినవాడని పోలీసులకు తెలిసినట్లు సమాచారం.

విచారణలో వెల్లడవుతున్న వివరాలకు పూర్తి భిన్నంగా ఘటనాస్థలిలో లభ్యమైన ఆధారాలు కనిపిస్తున్నాయి. బంగారునాయుడు కుటుంబం మృతిచెందిన ఫ్లాట్‌లో తలుపులన్నీ లోపలి నుంచి లాక్‌ చేసి ఉన్నాయి. నలుగురు కుటుంబసభ్యులూ ప్రాణాలు కోల్పోయి ఉండగా ఒక్క దీపక్‌ శరీరంపైనే.. కత్తి గాయాలు కనిపించలేదు. అతడి చేతిపై పెనుగులాటలో జరిగే స్వల్ప గాయాల్ని గుర్తించారు. దీపక్‌ మినహా మిగిలిన మూడు మృతదేహాల వద్ద కర్పూరం బిల్లలు ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుత ఆధారాల ప్రకారం.. దీపక్‌ హత్య చేసిన తర్వాత ఇంట్లో.. అగ్నిప్రమాదం జరిగినట్లు సృష్టించి పారిపోవడానికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది.

బయటి వ్యక్తులు వచ్చి హత్య చేసినట్లు ఆనవాళ్లు కనిపించటం లేదు. ఫ్లాట్ నుంచి బయటకు వచ్చే ద్వారాలు లాక్ చేసి ఉన్నాయి. ఇంట్లో అగ్ని వ్యాప్తికి శానిటైజర్ వినియోగించినట్లు తెలుస్తోంది. ఈ మంటలు దీపక్ ఉన్న గదిలో ఎక్కువ చెలరేగి హాల్ వరకు వ్యాపించాయి. దీపక్ రీడింగ్ రూమ్‌లో మంటల నుంచి తప్పించుకునేందుకు బాత్‌రూమ్‌లోకి వెళ్లి కుళాయి ఆన్‌ చేసి.. నీటితో ప్రాణాలు కాపాడుకునే యత్నం చేశాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో మంటలు, పొగ ప్రభావానికి దీపక్ ప్రాణాలు విడిచాడని పోలీసులు భావిస్తున్నారు.

ఏ కోణంలో చూసినా.. కుటుంబంలో అంతర్గతంగా తలెత్తిన సమస్యే ఈ దారుణ ఘటనకు దారితీసిందని అంచనా వేస్తున్నారు. బంధువులు, స్నేహితుల వాదనలు వేరుగా ఉన్నా.. ఆధారాలను విశ్లేషిస్తున్న పోలీసులకు.. దీపక్ వ్యవహారమే హత్యలకు కారణమని స్పష్టత వస్తోంది.

ఇదీ చదవండి: కరోనాతో నిన్న కొడుకు మరణం..నేడు తల్లి మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.