ETV Bharat / crime

MADHAPUR ROAD ACCIDENT: మాదాపూర్​ ప్రమాదంలో కారు నడిపిన వ్యక్తి అరెస్ట్​

మాదాపూర్​లో రోడ్డు ప్రమాదానికి కారణమైన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం ప్రమాదం జరిగిన వెంటనే అతను కారును వదిలేసి పారిపోయాడు. వాహనంపై 11కు పైగా చలాన్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ చలాన్లన్నీ డేంజరస్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్‌లకు చెందినవే.

MADHAPUR ROAD ACCIDENT: మాదాపూర్​ ప్రమాదంలో కారు నడిపిన వ్యక్తి అరెస్ట్​
MADHAPUR ROAD ACCIDENT: మాదాపూర్​ ప్రమాదంలో కారు నడిపిన వ్యక్తి అరెస్ట్​
author img

By

Published : Oct 4, 2021, 4:03 PM IST

మాదాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సీఐఐ జంక్షన్​ దగ్గర ద్విచక్రవాహనాన్ని.. కారు ఢీకొట్టిన ఘటనలో నిందితుడు సృజన్‌కుమార్‌ను మాదాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో సృజన్ కుమార్ మద్యం సేవించాడా..? లేదా..? అనేది నిర్ధారించేందుకు రక్త పరీక్షలు నిర్వహించారు. ఆదివారం ఉదయం సిగ్నల్ వద్ద ఆగి ఉన్న వాహనాన్ని ఢీకొట్టగా వెనుక కూర్చున్న జెన్నిఫర్ అక్కడికక్కడే మృతి చెందారు. బైకు నడుపుతున్న అజయ్ తీవ్ర గాయాలపాలై చికిత్స పొందుతున్నాడు. నిందితుడు సృజన్ కుమార్ కారు వదిలేసి పారిపోయాడు. అతని వాహనానికి 11కు పైగా చలాన్‌లు ఉన్నాయి. ఈ చలాన్లన్నీ డేంజరస్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్‌లకు చెందినవని పోలీసులు గుర్తించారు.

శనివారం రాత్రి కొండాపూర్‌లోని ఓ ఫ్లాట్‌లో సృజన్ కుమార్ పార్టీ చేసుకున్నాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. పార్టీ తర్వాత సృజన్ ఇంటికి రాలేదు.. మరుసటి రోజు ఆదివారం ఉదయం ఇంటికి కారులో బయల్దేరాడు. సీఐఐ సిగ్నల్ వద్ద ఆగి ఉన్న ద్విచక్రవాహనాన్ని అతివేగంగా ఢీకొట్టి ప్రమాదానికి కారకుడయ్యాడు. సెల్ టవర్ లొకేషన్ ఆధారంగా సృజన్ కుమార్‌ని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు.

మృతదేహంతో కుటుంబసభ్యుల ఆందోళన

మాదాపూర్ ప్రమాద ఘటనలో మృతి చెందిన జెన్నిఫర్​కు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వారి కుటుంబ సభ్యులు మృతదేహంతో మెట్టుగూడ స్మశాన వాటిక వద్ద ఆందోళనకు దిగారు. పోలీసులు వెంటనే నిందితునికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. అతి వేగంగా కారు నడపడం మూలంగానే ప్రమాదం జరిగి తన కూతురు చనిపోయిందని జెన్నిఫర్ తల్లిదండ్రులు ఆరోపించారు. తన కూతురికి, అజయ్​కి వచ్చే నెల వివాహం కూడా కుదిరిందని వారు బోరున విలపించారు. పోలీసులు సీసీ కెమెరాలు కూడా చూపించకుండా కేసు నమోదు చేయకుండా తాత్సారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కూతురికి జరిగిన ప్రమాద ఘటనపై తమకు న్యాయం జరగాలని కోరుతూ వారు స్మశాన వాటిక వద్ద ఆందోళనకు దిగారు.

ఇదీ చదవండి: Madhapur accident: మాదాపూర్‌లో రోడ్డుప్రమాదం.. యువతి మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.