జంట హత్య కేసులో నిందితులు .. ఆహారం తీసుకోవట్లేదని.. అధికారులు తెలిపారు. వైద్యుల సూచనలతో పోలీసులు దంపతులిద్దరినీ తిరుపతికి తరలిస్తున్నారు. ఈ మేరకు మదనపల్లె జైలు సూపరింటెండెంట్.. న్యాయమూర్తిని అనుమతి కోరారు. ఇదిలా ఉంటే.. పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పటి నుంచి నిందితులు చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తున్నారు.
బుధవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో భార్యాభర్తలను పోలీసులు వైద్యపరీక్షలకు తీసుకెళ్లారు. అక్కడ భార్య అరవడం వల్ల భర్త పురుషోత్తంనాయుడు సర్దిచెప్పేందుకు ప్రయత్నించగా.. ఆయన తన భర్తే కాదని తాను శివుడినని పక్కకు తోసేసిన విషయం తెలిసిందే.
ఇదీ చదవండి: బిడ్డలిద్దరూ శివపార్వతులు.. నేను కాళికను