ETV Bharat / crime

TAX Evasion: స్పోర్ట్స్ కార్లలో తిరుగుతారు.. కానీ పన్ను​ మాత్రం కట్టరు - ఖరీదైన కార్లు

ఖరీదైన కార్లను కొనడం... వాటికి పన్ను కట్టకుండానే తిరిగి... మళ్లీ అమ్మేయడం. కొన్నేళ్లుగా పన్ను కట్టకుండా తప్పించుకుంటున్న బడాబాబుల తీరు ఇది. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి కోట్లల్లో నష్టం వాటిల్లుతుంది. దీనిపై దృష్టి సారించిన రవాణా శాఖ... పక్కా ప్రణాళిక రచించింది. శంషాబాద్​లోని ఓ ఖరీదైన హోటల్​లో జరుగుతున్న ఫంక్షన్​కు.. అత్యంత ఖరీదైన స్పోర్ట్స్ కార్లు వస్తాయనే సమాచారం మేరకు.. అధికారులు నిఘా పెట్టారు. వారు అనుకున్నట్లే బడాబాబులు వచ్చి... అధికారులకు చిక్కారు.

TAX Evasion
బడాబాబుల తీరు
author img

By

Published : Aug 16, 2021, 7:35 AM IST

దేశంలోని పలు రాష్ట్రాల్లో సంపన్నులు కొనుగోలు చేసిన స్పోర్ట్స్ కార్లను.. కొన్ని నెలలు వాడిన తర్వాత సగం ధరకే వాటిని అమ్మేస్తుంటారు. ఈ విషయం తెలిసిన హైదరాబాద్​లోని కొందరు వ్యక్తులు... వాటిని కొనుగోలు చేసి.. కొన్ని నెలల వినియోగం తర్వాత అమ్మేస్తున్నారు. కానీ.. ఇక్కడే ఓ తిరకాసు ఉంది.

లగ్జరీ కార్లు కొని అమ్మేసే వీరు.. రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన కోట్ల రూపాయల పన్ను​ను ఎగ్గొడుతున్నారు. కొన్ని నెలలుగా దీనిపై రవాణాశాఖకు పలు ఫిర్యాదులు వచ్చాయి. సాధారణంగా కొత్తకారు కొనుగోలు చేసినప్పుడు దాని ఇన్వాయిస్​పై 14 శాతం పన్ను కట్టాల్సి ఉంటుంది. కోట్ల రూపాయల విలువైన కార్లను కొనుగోలు చేసినప్పుడు... వాటిపై కనీసం 8 శాతం పన్ను కట్టాల్సి ఉంటుంది. ఏళ్లు గడిచిన కొద్దీ ట్యాక్స్​ను తగ్గిస్తుంటారు.

ఒక్కో కారుపై రూ.20లక్షల పైనే!

ఒక్కో కారుపై రాష్ట్ర ప్రభుత్వానికి రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు పన్ను​ను చెల్లించాల్సి ఉంటుంది. వాటిని కొన్నవారు మాత్రం పన్ను చెల్లించరు. గుట్టుగా ఏ ఫంక్షన్లకో... రేసింగ్​లకో తీసుకెళ్తూ.. రాత్రిళ్లు వాడుతుంటారు. ఒకవేళ దొరికినప్పుడు చూద్దాంలే అనుకుంటారు. అలా పన్ను కట్టని ఫెర్రారీ, బెంజ్ వంటి సుమారు 11 ఖరీదైన స్పోర్ట్స్ కార్లపై రవాణాశాఖ అధికారులు నిఘాపెట్టారు. పక్క ప్రణాళికతో వాళ్లను పట్టుకున్నారు.

ఈ మాత్రానికి పన్ను చెల్లించాలా?

పాండిచ్చేరి, తమిళనాడు, ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలలో సంపన్నులు ఎక్కువగా స్పోర్ట్స్ కార్లను కొనుగోలు చేస్తుంటారు. కొన్ని నెలలు తర్వాత తిరిగి సెకండ్ హ్యాండ్​లో అమ్మేస్తుంటారు. వాటిని మన రాష్ట్రానికి చెందిన వారు కొనుగోలు చేసి.. ఇక్కడ రహస్యంగా వాడుకుంటుంటారు. కొద్ది నెలలు నడిపిన తర్వాత తిరిగి విక్రయిస్తుంటారు. కొన్ని నెలల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి లక్షలాది రూపాయల పన్ను​ను ఎందుకు చెల్లించాలని భావించి.. పన్ను చెల్లించరని రవాణాశాఖ అధికారులు పేర్కొంటున్నారు.

శంషాబాద్​లోని ఓ ఖరీదైన హోటల్​లో ఓ ఫంక్షన్​కు భారీ ఎత్తున సంపన్నులు హాజరయ్యారు. అందరూ స్పోర్ట్స్ కార్లలోనే వచ్చారనే సమాచారం రావడంతో అధికారులు అక్కడకు వెళ్లారు. తక్షణమే రంగంలోకి దిగి 11 ఖరీదైన కార్లను స్వాధీనం చేసుకున్నారు. వాటి ఇన్వాయిస్ ప్రకారం చూస్తే.. రవాణాశాఖకు సుమారు రూ.5 నుంచి రూ.8 కోట్ల వరకు పన్ను చెల్లించాల్సి ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఒక్కసారి నిఘాపెడితేనే ఇన్ని కార్లు దొరికితే.. ఇంకా నగరంలో ఎన్ని కార్లు తిరుగుతున్నాయోనన్న ప్రశ్న తలెత్తక మానదు.

ఇదీ చూడండి: Loan Waiver : రాష్ట్రంలో నేటి నుంచి రెండో దఫా రుణమాఫీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.