Suicide Attempt: ఓ వివాహిత.. ప్రియుడితో కలిసి విషం తాగిన ఘటన వికారాబాద్ జిల్లా పూడూరు మండలం కండ్లపల్లి అటవీ ప్రాంతంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్సై శ్రీశైలం తెలిపిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన వివాహిత (32) జిల్లాకు చెందిన యువకుడి (22)తో కొంత కాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. తమ పెళ్లికి అడ్డంకులు వస్తాయని వారు అటవీ ప్రాంతానికి చేరుకుని పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఎస్సై శ్రీశైలం తెలిపారు.
స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించగా.. వెంటనే చికిత్స నిమిత్తం వికారాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మహిళకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా ఇద్దరూ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో ఒకే చోట పనిచేస్తున్నట్లు చెప్పారు.
ఇదీ చదవండి: Rape Attempt on Disabled: నడవలేని అమ్మాయిపై తాత వయసున్న వ్యక్తి అత్యాచారయత్నం..