ETV Bharat / crime

Lovers Suicide: ప్రియురాలికి పెళ్లి కుదిరిందని.. ప్రేమజంట ఆత్మహత్య - తెలంగాణ వార్తలు

Lovers commits suicide by drinking pesticide in nalgonda district, lovers suicide 2021
పురుగులమందు తాగి ప్రేమజంట ఆత్మహత్య, ప్రేమజంట సూసైడ్ 2021
author img

By

Published : Oct 24, 2021, 10:13 AM IST

Updated : Oct 24, 2021, 12:24 PM IST

10:09 October 24

పురుగులమందు తాగి ప్రేమజంట ఆత్మహత్య

ఒకరిపై ఒకరు మనసుపడ్డారు. ఎన్నో ఊసులు చెప్పుకున్నారు. జీవితాంతం కలిసుంటామని కలలు కన్నారు. కానీ వారి కలలన్నీ కల్లలయ్యాయి. ప్రియురాలికి వేరే వ్యక్తితో పెళ్లి నిశ్చయం జరిగింది. తమ ప్రేమ ఫలించలేదని మనస్తాపానికి గురయ్యారు. కలిసి ఉండలేమని భావించి... చావులో(Lovers Suicide news) ఒక్కటయ్యారు.

ఏం జరిగింది?

నల్గొండ జిల్లా  తిరుమలగిరి మండలం తెట్టేకుంట గ్రామంలో ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మూడు రోజుల క్రితం  తెట్టేకుంట గ్రామానికి చెందిన మిట్టపల్లి కొండల్(22), సంధ్య(19) పురుగులమందు తాగారు. చికిత్స పొందుతూ ఇద్దరూ ఇవాళ ఉదయం మృతిచెందారు.

ప్రియురాలికి పెళ్లి నిశ్చయం...

వీరిద్దరూ గతకొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. యువతికి ప్రేమించిన వ్యక్తిని కాదని వేరొకరితో వివాహం నిశ్చయించారు. మనస్తాపం చెందిన ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. యువకుడి ఇంట్లో ఎవరూలేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు(Lovers Suicide news) యత్నించారు. గమనించిన కుటుంబసభ్యులు చికిత్స కోసం నల్గొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఇద్దరూ ఆదివారం మృతి చెందారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను సాగర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఎదిగిన కుమారుడు, పెళ్లీడుకు వచ్చిన కుమార్తె మరణంతో రెండు కుటుంబాల్లో విషాదం అలుముకుంది.

ఇదీ చదవండి: wow startup: వావ్ అంకుర సంస్థ.. ‘అరె మామా... మనం సేమ్‌ కాలేజీరా!’

Last Updated : Oct 24, 2021, 12:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.