ETV Bharat / crime

'ప్రేమించి దగ్గరయ్యాడు.. పెళ్లంటే వీడియోలు బయట పెడతానంటున్నాడు..' - పెళ్లిపేరుతో ప్రియుడి మోసం

Sexual Harassment Case: ఇద్దరు మేజర్లే. ప్రేమలో పడ్డారు. కలిసి తిరిగారు. కానీ అమ్మాయి పెళ్లి చేసుకోమన్న ప్రతిసారి అబ్బాయి మాట దాటవేసేవాడు. అలా అని ఆ అమ్మాయి వేరే ఎవరిని చేసుకోకూడదనేవాడు. ఎవరినైనా పెళ్లి చేసుకుంటే తనతో సన్నిహితంగా ఉన్న ఫోటోలు, వీడియోలు సోషల్​ మీడియాలో పోస్టు చేస్తానని బెదిరించేవాడు. ప్రియుడి ప్రవర్తనతో విసిగిపోయిన మహిళ ఏం చేసిందంటే...

Sexual Harassment Case
ప్రేమికుడు మోసం
author img

By

Published : Jan 21, 2022, 10:26 AM IST

Sexual Harassment Case: మహిళలు, యువతులపై నిత్యం అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడో చోట ఏదో విధంగా మహిళలు మోసపోతూనే ఉన్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ యువతిపై రాజేంద్రప్రసాద్ అనే యువకుడు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డ ఘటన బోయిన్​పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

పెద్దపల్లి జిల్లా అందుగుల పల్లికి చెందిన యువతి గత మూడేళ్లుగా ఓ ప్రైవేట్ కంపెనీలో డేటా ఆపరేటర్​గా పనిచేస్తోంది. నాలుగేళ్ల క్రితం తన అక్క వివాహంలో.. కరీంనగర్ జిల్లాలోని గద్దె పక్క గ్రామానికి చెందిన రాజేంద్రప్రసాద్​తో పరిచయమైంది. అది కాస్తా ప్రేమకు దారితీసింది. ఈ క్రమంలోనే రాజేంద్రప్రసాద్​.. బాధితురాలిని వివాహ చేసుకుంటానని నమ్మించి.. శారీరకంగా దగ్గరయ్యారు. ఈ క్రమంలోనే ప్రియుడు ఆమెను ఫోటోలు, వీడియోలు తీశాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. తనను వివాహం చేసుకోవాలని అడిగినప్పుడు.. నిందితుడు మాట దాటవేస్తూ వచ్చాడని... కొద్ది రోజులుగా పెళ్లి చేసుకోనని చెప్పినట్లు వెల్లడించింది. ఒకవేళ ఆమె ఇతరులను ఎవరినైనా వివాహం చేసుకుంటే తన వద్ద ఉన్న ఫోటోలు , వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్​ చేస్తానని బెదిరిస్తున్నాడని తెలిపింది. విసిగిపోయిన బాధితురాలు గురువారం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

ఇదీ చూడండి: అదుపుతప్పి కారు బోల్తా.. ఆరుగురికి తీవ్రగాయాలు

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.