ETV Bharat / crime

ప్రేమికుడి ఘాతుకం.. కత్తిపీటతో ప్రియురాలి గొంతుకోసి హత్య - muder case news

lover-brutally-murder-his-girl-friend-at-venkatraopally
lover-brutally-murder-his-girl-friend-at-venkatraopally
author img

By

Published : Nov 9, 2021, 6:44 PM IST

Updated : Nov 9, 2021, 10:05 PM IST

18:41 November 09

ప్రేమికుడి ఘాతుకం.. కత్తిపీటతో ప్రియురాలి గొంతుకోసి హత్య

పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం వెంకట్రావుపల్లిలో దారుణం చోటుచేసుకుంది. పెళ్లికి నిరాకరించందనే కోపంతో ప్రియురాలి గొంతు కోసి హత్య చేశాడు ఓ ప్రేమికుడు. వెంకట్రావుపల్లి గ్రామంలోని కెకె నగర్​కు చెందిన గొడుగు అంజలి(25) డిగ్రీ చదువుతోంది. ఆ పక్కనే ఉన్న తారకరామారావు నగర్​కు చెందిన చాట్ల రాజు(30).. అడపాదడపా మెకానిక్​ పనులు చేస్తుంటాడు. పక్కపక్క వీధుల్లోనే ఉండటం వల్ల వీళ్లిద్దరికీ ముందు నుంచే పరిచయం ఉంది. అది కాస్తా ప్రేమగా మారింది.

పెళ్లికి ఒప్పుకోకపోవటం వల్ల..

ఇలా మూడేళ్లుగా ఒకరినొకరు ప్రేమించుకున్నారు. తనను పెళ్లి చేసుకోవాలంటూ అంజలిని రాజు చాలా సార్లు అడిగాడు. యువతి తల్లిదండ్రులకు ఈ విషయం తెలియటంతో పెళ్లికి ఒప్పుకోలేదు. తల్లిదండ్రులు చెప్పిన కారణాల వల్లో.. లేదా భయపెట్టటం వల్లో.. అంజలి కూడా వారి నిర్ణయానికే తలొంచింది. ప్రియురాలి నిర్ణయంతో ఏకీభవించని రాజు.. తనను పెళ్లి చేసుకోవాల్సిందేనని వేధించసాగాడు. ఈ క్రమంలోనే రెండు సార్లు పంచాయితీ కూడా జరిగింది.

కోపంగా మారిన ప్రేమ..

ఎన్ని సార్లు అడిగినా పెళ్లికి నిరాకరించటం వల్ల తన ప్రియురాలిపై ఉన్న ప్రేమ కాస్తా.. తీవ్ర కోపంగా మారింది. "తనకు దక్కనిది.. ఇంకెవరికీ దక్కకూడదు" అనుకున్నాడో ఏమో ఆ ప్రేమికుడు. ప్రియురాలి ఇంట్లో ఎవరూలేని సమయంలో ఇంట్లో చొరబడ్డాడు. కోపావేశంలో తన ప్రియురాలిని కత్తిపీటతో గొంతు కోసి పరారయ్యాడు. తీవ్ర రక్తస్రావమై.. అంజలి అక్కడిక్కడే మృతి చెందింది.

రాజు కోసం గాలింపు..

రక్తపుమడుగులో ఉన్న అంజలిని గమనించిన కుటుంబసభ్యులు గుండెలు బాదుకున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పరిశీలించారు. కుటుంభసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటన స్థలాన్ని పెద్దపల్లి డీసీపీ రవీందర్, గోదావరిఖని ఏసీపీ గిరి ప్రసాద్, గోదావరిఖని రెండో పట్టణ సీఐ శ్రీనివాసరావు పరిశీలించారు. పరారీలో ఉన్న రాజు కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

ఇదీ చూడండి:

Last Updated : Nov 9, 2021, 10:05 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.