ETV Bharat / crime

Anantapur Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి - telangana news

Anantapur Accident : అనంతపురం జిల్లా రాప్తాడులో ఘోర ప్రమాదం జరిగింది. ఇవాళ తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

Anantapur Accident
ఘోర రోడ్డు ప్రమాదం
author img

By

Published : Feb 23, 2022, 11:34 AM IST

Anantapur Accident : ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా రాప్తాడు సమీపంలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్ర గాయాలైన మరొకరిని అనంతపురం ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ చనిపోయారు.

కియా ఫ్యాక్టరీ వద్ద బొలెరో వాహనం రిపేరుకు వచ్చింది. ఆ వాహనాన్ని మరో వాహనంతో అనంతపురం తీసుకొస్తున్నారు. రాప్తాడు రైస్ మిల్లు వరకు రాగానే గుర్తుతెలియని వాహనం.. ఈ రెండు వాహనాలను ఢీ కొట్టింది. బొలెరో వాహనాల్లో ఉన్న డ్రైవర్లు మల్లికార్జున, పవన్ అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రగాయాలైన ద్వారకేశ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: నకిలీ పట్టాలకు 'ప్రైవేటు' అడ్డా.. సూత్రధారి అనకాపల్లి వాసి..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.