పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం చిన్నకల్వల రాజీవ్ రహదారిపై శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కరీంనగర్ వైపు వెళ్తున్న కారు ముందు వెళ్తున్న లారీని వేగంగా ఢీ కొట్టింది. కారులో ప్రయాణిస్తున్న సత్యనారాయణ, శ్రీనాథ్ అనే ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.
స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు సుమారు అరగంట పాటు శ్రమించి మృతదేహాలను బయటకు తీశారు. మృతులు పెద్దపెల్లి జిల్లా కేంద్రంలోని ఓ బియ్యం మిల్లులో గుమస్తాలుగా పని చేస్తారని పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: కూర్చున్న వ్యక్తి కూర్చున్నట్టే.. ప్రాణాలు కోల్పోయాడు.!