Lorry catches fire in vishakapatnam: ఏపీలోని విశాఖ జిల్లా పెందుర్తి మండలం అక్కిరెడ్డిపాలెం వద్ద అగ్గిపెట్టెల లారీ దగ్ధమైంది. తమిళనాడు నుంచి బిహార్ వెళ్తున్న అగ్గిపెట్టెల లారీని.. ఎదురుగా వస్తున్న వాహనం తాకుతూ వెళ్లింది. ఈ రాపిడికి మంటలు చెలరేగాయి. లోపల మొత్తం అగ్గిపెట్టెలు ఉండడంతో.. క్షణాల్లో మంటలు లారీ మొత్తం వ్యాపించాయి.
లారీ డ్రైవర్, క్లీనర్ అప్రమత్తమై కిందకుదిగి.. ప్రాణాలు కాపాడుకున్నారు. లారీ మాత్రం పూర్తిగా కాలిపోయింది. పెందుర్తి- ఆనందపురం ప్రధాన రహదారిపై నాలుగు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించగా.. పోలీసులు చక్కదిద్దారు.
ఇదీ చూడండి: harassment on women: నగ్నంగా వీడియో కాల్ చేస్తావా..లేదా!