ETV Bharat / crime

Loan APP: యువతికి అసభ్య చిత్రాలు.. లోన్​యాప్​ ప్రతినిధి అరెస్ట్​ - telangana varthalu

Loan APP: యువతికి అసభ్య చిత్రాలు పంపించి వేధించిన లోన్‌ యాప్‌ ప్రతినిధిని హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు. యువతి లోన్​ తీసుకుని సకాలంలో చెల్లించకపోవడంతో చరవాణికి అసభ్య సందేశాలతో పాటు.. ఆమె ఫొటోను మార్ఫింగ్‌ చేసిన నగ్న చిత్రాలు వచ్చాయి. బాధితురాలు హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Loan APP: యువతికి అసభ్య చిత్రాలు.. లోన్​యాప్​ ప్రతినిధి అరెస్ట్​

author img

By

Published : May 28, 2022, 10:28 PM IST

Loan APP: ఓ యువతికి అసభ్య చిత్రాలు పంపించి వేధించిన లోన్​యాప్ ప్రతినిధిని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్​కు చెందిన యువతి లోన్​యాప్​లో రుణం తీసుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల సకాలంలో కిస్తీలు చెల్లించలేకపోయింది. యువతి చరవాణికి అసభ్య సందేశాలతో పాటు ఆమె ఫొటోను మార్ఫింగ్​ చేసిన నగ్న చిత్రాలు వచ్చాయి. బాధితురాలు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని నిందితుడి బిహార్​లోని సివాన్ జిల్లా గోపాల్​పూర్ కోఠిలో ఉన్నట్లు తెలుసుకున్న సైబర్ క్రైం పోలీసులు అక్కడికి వెళ్లారు. మనీష్ కుమార్​ను అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకొచ్చి నాంపల్లి కోర్టులో హాజరుపర్చి రిమాండ్​కు తరలించారు.

ఈ కేసులో వికాస్ కుమార్ అనే లోన్​యాప్ నిర్వాహకుడు పరారీలో ఉన్నట్లు సైబర్ క్రైం పోలీసులు తెలిపారు. కిస్తీలు సకాలంలో చెల్లించని వాళ్ల ఆధార్, పాన్ కార్డు, ఫొటోను వికాస్... మనీష్​కు పంపిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. కిస్తీలు చెల్లించేలా రుణగ్రహీతలపై ఒత్తిడి తెచ్చేందుకు మనీష్.. అసభ్య సందేశాలు పంపడంతో పాటు రుణగ్రహీతల ఫొటోలను మార్ఫింగ్​ చేసి నగ్నచిత్రాలు రూపొందిస్తున్నట్లు సైబర్ క్రైం పోలీసులు తేల్చారు. అసభ్య చిత్రాలను రుణగ్రహీత ఫోన్​లో ఉన్న బంధువులు, స్నేహితులు, కుటుంబ సబ్యుల నెంబర్లను ఎంపిక చేసుకొని వాళ్ల మొబైల్ ఫోన్లకు మనీష్ పంపిస్తున్నాడు. పరారీలో ఉన్న వికాస్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.