ETV Bharat / crime

Life imprisonment: బాలుడిపై హత్యాచారం కేసులో కోర్టు తీర్పు - రంగారెడ్డి జిల్లా వార్తలు

అభం శుభం తెలియని ఏడేళ్ల బాలుడిపై లైంగిక దాడి చేసి.. హత్య చేసిన నిందితుడికి న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. ఈ ఘటన బాలాపూర్​ పీఎస్​ పరిధిలో చోటు చేసుకుంది.

Life imprisonment
బాలుడిపై లైంగికదాడి హత్య
author img

By

Published : Jul 20, 2021, 7:41 PM IST

కామంతో పశువులా మారిన ఓ వ్యక్తికి... అభం శుభం తెలియని బాలుడు కనిపించాడు. ఎవరు అయితే ఏముంది తన కోరిక తీరడం ముఖ్యమనుకుని... బాలునికి మాయమాటలు చెప్పాడు. కిరాణ దుకాణానికి వెళ్తున్న బాలుడికి చాక్లెట్ ఆశచూపి... అక్కడి నుంచి ఎత్తుకెళ్లాడు. బాలునిపై లైంగిక దాడి చేసి.. హత్యచేశాడు. ఈ ఘటనపై కోర్టు నిందితుడికి జీవితఖైదు విధించింది.

వివరాల్లోకి వెళ్తే..

బాలాపూర్​ పీఎస్​పరిధిలోని జల్​పల్లి న్యూహుడా కాలనీకి చెందిన ఒమర్​ బిన్​ వ్యసనాలకు అలవాటు పడి ఆకతాయిగా తిరిగేవాడు. కిరాణ దుకాణానికి వెళ్తున్న బాలుడిని అడ్డగించి... చాక్లెట్​ ఆశ చూపాడు. మెల్లిగా అక్కడి నుంచి బాలుడిని తీసుకెళ్లాడు. సమీపంలో ఉన్న నిర్మానుష్యా ప్రాంతానికి తీసుకెళ్లి... లైంగిక దాడి చేశాడు. రక్షించిమని కేకలు వేస్తున్న బాలుడిని నేలకేసి బాదాడు. ఈ ఘటనలో బాలుడు తల పగిలి తీవ్ర రక్తస్రావమై... అక్కడికక్కడే మృతి చెందాడు. బాలుడి అరుపులు విన్న చుట్టుపక్కల వాళ్లు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు.

Life imprisonment
జీవిత ఖైదు

సొంత చెల్లిని వదలని కామాంధులు.. చిన్నతనం నుంచే లైంగిక వేధింపులు

ఈ దుర్ఘటన మే 8వ తేదీ 2019 సంత్సరంలో చోటు చేసుకుంది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు బాలాపూర్​ పోలీసులు కేసు నమోదు చేసుకుని... నిందితుడిని అరెస్ట్ చేశారు. రిమాండ్​కు తరలించారు. సాక్ష్యాలు, ఆధారాలతో పోలీసులు.. నిందితుడిని న్యాయస్థానం ఎదుట హాజరుపర్చారు. విచారణ పూర్తి అయిన తర్వాత రంగారెడ్డి కోర్టు ఒమర్​బిన్​ హసన్​ను నిందితుడిగా తేల్చింది. నిందితుడికి జీవితఖైదు విధించడంతో పాటు... రూ.7వేల జరిమానా విధించింది.

ఇదీ చూడండి: మహిళలపై అత్యాచారం సీరియల్ కిల్లర్‌కు జీవిత ఖైదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.