ETV Bharat / crime

ROAD ACCIDENT: గుర్తుతెలియని వాహనం ఢీకొని చిరుత మృతి - తెలంగాణ వార్తలు

మహబూబ్​నగర్ జిల్లాలో ఓ రోడ్డు ప్రమాదంలో చిరుతపులి మృతి చెందింది. వేటకు వచ్చిన చిరుత... గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతిచెందినట్లు అధికారులు చెబుతున్నారు. ఘటనా స్థలంలో అటవీ శాఖ అధికారులు విచారణ జరుపుతున్నారు.

ROAD ACCIDENT, Leopard dead
రోడ్డు ప్రమాదంలో చిరుత మృతి, దేవరకద్రలో చిరుత మరణం
author img

By

Published : Sep 8, 2021, 10:26 AM IST

Updated : Sep 8, 2021, 10:34 AM IST

మహబూబ్​నగర్ జిల్లాలో ఓ రోడ్డు ప్రమాదంలో(ROAD ACCIDENT) చిరుతపులి(Leopard) మృతి చెందింది. దేవరకద్ర మండలంలో చోటుచేసుకుంది. దేవరకద్రలోని 167వ జాతీయ రహదారికి ఇరువైపులా మన్యంకొండ, గద్దెగూడెం అటవీ ప్రాంతాలు ఉన్నాయి. ఈ అటవీ క్షేత్రంలో కొన్నేళ్లుగా చిరుత సంచరిస్తున్నట్లుగా అటవీశాఖ అధికారులు గుర్తించారు. మంగళవారం రాత్రి సమయంలో రోడ్డుకు ఇరువైపులా గొర్రెల మందలు నిలబడడంతో... వేటకు వచ్చిన చిరుత పులి... రోడ్డు దాటే క్రమంలో మన్నెంకొండ-చౌదర్​పల్లి గుట్టల మధ్య బుధవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందింది.

స్థానిక పోలీసుల ద్వారా సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతిచెందిన చిరుతను పరిశీలించారు. రెండేళ్ల వయసు ఉన్న ఆడ చిరుత పులి వేటకు వచ్చి... రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు మహబూబ్ నగర్ అటవీశాఖ రేంజ్ అధికారి చంద్రయ్య తెలిపారు. ఘటనా స్థలంలో విచారణ చేపట్టిన అధికారులు... పశువైద్యుడితో పోస్టుమార్టం చేయించి చిరుత మృతికి గల పూర్తి కారణాలు తెలుసుకుంటామని పేర్కొన్నారు. స్థానికంగా ఉన్న గుట్టల్లో చిరుతల గుంపు ఉన్నట్లు తెలుస్తోందని అధికారులు చెబుతున్నారు. మన్యంకొండ క్షేత్ర పరిధిలో ఈ ప్రమాదం జరగడంతో చిరుతల సంచారంపై భక్తులు ఆందోళన చెందుతున్నారు.

ఇదీ చదవండి: RAINS IN TELANGANA: రాష్ట్రంపై వరుణాగ్రహం.. ఉత్తర తెలంగాణలో కుండపోత

Last Updated : Sep 8, 2021, 10:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.