మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలంలోని చౌదర్ పల్లి అటవీ ప్రాంతంలో మేతకు వెళ్లిన మేకల మందపై చిరుతపులి దాడి చేసింది. గుహల్లో నుంచి వచ్చి దాడి చేసిందని మేకల కాపరులు చెబుతున్నారు. మేకను చిరుత తీసుకొని వెళ్తుండగా.. కాపర్లు కేకలు వేయడంతో కొంతదూరం మేకను తీసుకెళ్లిన చిరుతపులి... అక్కడే వదిలి పారిపోయిందని చెప్పారు.
చిరుతపులి దాడి ఘటన విషయం గ్రామస్థులు అటవీ అధికారులకు తెలిపారు. ఈ ప్రాంతంలో చిరుత సంచారం కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. అటవీ శాఖ అధికారులు చిరుతను బంధించి.. అరణ్య ప్రాంతానికి తరలించాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి: రేపటి నుంచి పూర్తిస్థాయి కొవిడ్ ఆస్పత్రిగా గాంధీలో సేవలు