హైదరాబాద్ ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డిఫెన్స్ కాలనీలో కిడ్నాప్‌కు గురైన టింబర్ డిపో యజమాని ఆచూకీ లభించింది. రాత్రి పూటే ఆరిఫ్ అక్బర్‌ని మేడ్చల్‌లో వదిలివేయగా... అతను నేరుగా నాగపూర్ వెళ్లినట్లు పోలీసులు తెలిపారు.
సీసీ కెమెరాలను ఆఫ్ చేసి.. ఆపై దోచేసి
శుక్రవారం అర్ధరాత్రి కైఫ్ ట్రేడర్స్ ఉడ్ యజమాని ఆరిఫ్ అక్బర్‌ని పది మంది గుర్తు తెలియని వ్యక్తులు కారులో వచ్చి తీసుకెళ్లారు. అంతకుముందే సీసీ కెమెరాలను ఆఫ్ చేసిన దుండగులు... దుకాణంలో ఉన్న లక్షల విలువైన కలపను డీసీఎం వ్యాన్‌తో సహా ఎత్తుకెళ్లారు. నిందితుల కోసం పోలీసులు 6 బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. ఆర్థిక లావాదేవీలే ఈ కిడ్నాప్‌కి కారణమని పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో తేల్చారు.
ఇదీ చూడండి: బొమ్మల తయారీ పరిశ్రమలతో ఉపాధి కల్పన