ETV Bharat / crime

మందపైకి దూసుకెళ్లిన లారీ... 70 గొర్రెలు మృతి - కేటిదొడ్డి తాజా వార్తలు

తెల్లవారుజామున వేగంగా వచ్చిన లారీ గొర్రెల మందపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 70 మూగజీవాలు అక్కడికక్కడే మృతి చెందాయి. మరో 35 గొర్రెలకు తీవ్రంగా గాయాలయ్యాయి. జోగులాంబ గద్వాల జిల్లా కేటిదొడ్డి మండలానికి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.

Larry crashes into herd 70 sheeps
Larry crashes into herd 70 sheeps
author img

By

Published : Jun 2, 2022, 2:43 PM IST

జోగులాంబ గద్వాల జిల్లా కేటిదొడ్డి మండలానికి సమీపంలో ఓ లారీ... గొర్రెల మందను ఢీకొనడంతో 70 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. మరో 35 గొర్రెలకు గాయాలయ్యాయి. నందిన గ్రామానికి చెందిన రామప్ప అనే వ్యక్తి తెల్లవారుజామున 4 గంటల సమయంలో గొర్రెలు మేపేందుకు జూరాల డ్యాం ప్రాంతానికి తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. చనిపోయిన గొర్రెల విలువ సుమారు 8 లక్షల రూపాయల వరకు ఉంటుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రమాద అంశంపై విచారణ చేపట్టారు.

ఇవీ చదవండి:'నన్నే తిట్టావు కదమ్మా.. నాతో పాటే నువ్వూ చావు..'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.