ఆటోలో మర్చిపోయిన మూడు తులాల బంగారు చైన్‌ను సీసీటీవీ ఆధారంగా లంగర్ హౌస్ పోలీసులు స్వాధీనం చేసుకుని ఫిర్యాదుదారుకి అందించారు. ఈ నెల 25న రాత్రి 8:30 గంటల సమయంలో షఫీ ఉద్దీన్ అనే వ్యక్తి చార్మినార్ నుంచి లంగర్ హౌస్ వెళ్లి.. ఎండీ లైన్స్‌లోని తన నివాసానికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఆటోలో తాను 30 గ్రాముల బంగారు చైన్ మర్చిపోయిన విషయం గుర్తుకువచ్చింది.
లంగర్ హౌస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే స్పందించిన లంగర్ హౌస్ క్రైమ్ పోలీసులు సీసీటీవీ ఫుటేజ్, సీ డేటా ఆధారంగా కేసును ఛేదించారు. 30 గ్రాముల బంగారు చైన్‌ను స్వాధీనం చేసుకుని షఫీ ఉద్దీన్‌కు అప్పగించారు.
ఇదీ చూడండి : మాస్కు లేకుండా బయటకు వస్తే జరిమానానే: జీహెచ్ఎంసీ