నకిలీ పత్రాలు సృష్టించి స్థలం విక్రయించేందుకు ప్రయత్నించిన 8 మంది సభ్యుల ముఠాను సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం పోలీసులు అరెస్టు చేశారు. అమీర్‌పేట్‌కు చెందిన ముఖేష్ అగర్వాల్.. మరో ఏడుగురు అనుచరులతో కలిసి తెల్లాపూర్‌లోని 430 గజాల స్థలాన్ని నకిలీ పత్రాల ద్వారా అమ్మేందుకు యత్నించారు. విషయం తెలుసుకున్న స్థలం యజమాని రాఘవేంద్ర ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
రంగంలోకి దిగిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టడంతో ముఠా ఆగడాలు బయటపడ్డాయి. యజమానికి తెలియకుండా భూకబ్జాకు యత్నించిన ఈ ముఠాలో మొత్తం 13 మంది ఉన్నట్లు విచారణలో తేలింది. పరారీలో ఉన్న మరో ఐదుగురు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
మధ్య దళారులను నమ్మవద్దని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ సూచిస్తున్నారు. స్థలం క్రయ విక్రయాలకు సంబంధించి అసలు యజమానులనే సంప్రదించాలని ఆయన వివరించారు.
ఇదీ చదవండి: శేషాచల అడవుల్లో పోలీసుల కూంబింగ్.. ఇద్దరు స్మగ్లర్ల అరెస్ట్