YSRCP followers attack: ఏపీ కృష్ణా జిల్లాలో అధికార వైకాపా వర్గీయులు రెచ్చిపోయారు. ఏకంగా మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్పైనే దాడికి తెగబడ్డారు. కొన్ని రోజుల నుంచి రాత్రివేళ అక్రమంగా మట్టి తవ్వుతున్నారనే సమాచారంతో.. రెవెన్యూ సిబ్బందితో కలిసి ఆర్ఐ అరవింద్ గుడివాడ మండలం మోటూరు ప్రాంతానికి వెళ్లారు. అప్పటికే అక్కడ జేసీబీలతో మట్టి తవ్వుతున్నారు.
దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఆర్ఐ... తవ్వడానికి వీల్లేదంటూ జేసీబీకి అడ్డుగా నిలబడ్డారు. రెచ్చిపోయిన వైకాపా వర్గీయులు ఆయనతో వాగ్వాదానికి దిగారు. అదే క్రమంలో మీదికి వెళుతూ ఆయన్ను బెదిరించారు. అయినా వెనక్కి తగ్గకపోవడంతో ఆర్ఐపై తీవ్రంగా దాడి చేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికి పోలీసులు అక్కడికి చేరుకోకపోవడంతో.. మట్టి తవ్వకాలు ఆపేశారు. మట్టి తవ్వడం చట్టవిరుద్ధమని చెబుతున్నా వినకుండా అడ్డుకున్న తనపై విచక్షణారహితంగా దాడి చేశారని ఆర్ఐ అరవింద్ వాపోయారు.